వాంకిడి: ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సామేల గ్రామానికి చెందిన సెండె శివతేజ (17) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం కనర్‌గాం గ్రామ శివారులో కోలె గణపతికి చెందిన వ్యవసాయ భూమిలోగల పత్తి కట్టెలు తొలగించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న కాలువను గమనించక ట్రాక్టర్‌ను రివర్స్ తీశాడు. దీంతో ట్రాక్టర్ కాలువలో బోల్తా పడగా దాని కింద ఇరుక్కుని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


