కోటపల్లి: మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర సరిహద్దు మీదుగా తెలంగాణలోకి అక్రమంగా వరి ధాన్యం తరలింపును అడ్డుకునేందుకు ఏర్పాటు చేసి న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు నామమాత్రమే అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తుండగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కొంతమంది దళారులు ధాన్యం తెచ్చి సొమ్ము చేసుకుంటుండగా దీనిని అడ్డుకునేందుకు రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించింది. మండలంలోని రాపన్‌పల్లి ప్రాణహిత నది సమీపంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో బుధవారం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును రెవెన్యూ, పోలీ స్, వ్యవసాయశాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు. కాగా, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వరి ధాన్యం బస్తాలతో ట్రాక్టర్ రాగా అధికారులు పరిశీలించారు. తిరిగి వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోకి ధాన్యం రాకుండా అడ్డుకుని సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసులు చేయాల్సిన అధికారులే వదిలివేయడంతో అక్రమ ధాన్యం రవాణాకు ఆజ్యం పోసినట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు.
నామమాత్రపు తనిఖీలే..
మండలంలోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు నామమాత్రమే అయ్యాయి. తెలంగాణలో కి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేసి న చెక్‌పోస్టు వద్ద పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఽఇంతమంది అధికారులు విధులు నిర్వహిస్తున్నా గతంలో చెన్నూర్‌లో రెండు, మూడుసా ర్లు ధాన్యం బస్తాలతో వచ్చిన లారీలను రైతులే అ డ్డుకుని అధికారులకు అప్పగించిన సందర్భాలున్నా యి. కాళేశ్వరం అన్నారం బ్యారేజ్ మీదుగా చెన్నూర్ మండలంలోకి అక్రమంగా ధాన్యం తీసుకువచ్చే అ వకాశాలున్నట్లు గతంలో పలువురు అధికారులు ఉ న్నతాధికారులకు నివేదించినా అటువైపు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది కళ్లు గప్పి లోనికి వాహనాలు ఎలా వస్తున్నాయి? పట్టుబడిన వాహనాలకు ఎలాంటి కేసులు చేయరాదని, ధాన్యాన్ని రై తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని అధికారులే చెబు తుండగా, అలాంటప్పుడు మూడు శాఖల అధికా రులు 24గంటల విధులు నిర్వహిస్తుండడం ఎందుకని పలువురు అధికారులు చర్చించుకోవడం కొసమెరుపు. ఎలాంటి కేసులు చేయకపోతే అక్రమంగా ధాన్యం తీసుకువచ్చే వారికి ఏం భయం ఉంటుందని కొందరి వాదన. దీనిని అలుసుగా తీసుకుని దళారులు అధికారులను మచ్చిక చేసుకుని ధాన్యం వాహనాలను అక్రమంగా రాత్రిపూట, తెల్లవారుజామున మన రాష్ట్రంలోకి తెస్తున్నారని గతంలో పట్టుబడిన వాహనదారులు విచారణ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ధాన్యం బస్తాలతో వచ్చే వాహనాలను తనిఖీ కేంద్రం వద్ద ఆపి వెనక్కి పంపడం మినహా ఎలాంటి కేసులు నమోదు చేసే అధికారం తమకు లేదని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బ్రహ్మారావు తెలిపారు. ధాన్యాన్ని రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


