● 32.5 తులాల బంగారం, కిలో వెండి, రూ.1.50 లక్షల నగదు చోరీ | - | Sakshi
Sakshi News home page

● 32.5 తులాల బంగారం, కిలో వెండి, రూ.1.50 లక్షల నగదు చోరీ

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

● 32.5 తులాల బంగారం, కిలో వెండి, రూ.1.50 లక్షల నగదు చోరీ

మంచిర్యాలలో భారీ చోరీ

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో ఈ నెల 23న రాత్రి భారీ చోరీ జరిగింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం. రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి ముదాం నాగయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 22న జైపూర్‌ మండలం రామారావుపేటలోని బంధువుల ఇంట్లో జరిగిన సంవత్సరీకం కార్యక్రమానికి వెళ్లాడు. తిరిగి 23న రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తలుపులు తెరుచుకుని, మాస్టర్‌ బెడ్‌రూమ్‌లోని బీరువా తలు పులు పగులగొట్టి ఉన్నాయి. నాగయ్య దొంగతనం జరిగినట్లు భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. 32.5 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 1.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలంలో ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement