హత్య కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుల అరెస్టు

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

జైపూర్‌: మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఒకరిని కొట్టి చంపిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ తెలిపారు. గురువారం అసిస్టెంట్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీఐ నవీన్‌కుమార్‌, ఎస్సైలు రాజశేఖర్‌, రాజేందర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. జైపూర్‌ మండలం బెజ్జాలకు చెందిన గుమ్ముల రాజం (56) తమ కుటుంబానికి మంత్రాలు చేయడం మూలంగా ఆస్పత్రుల పాలవుతున్నామని గ్రామానికి చెందిన గుమ్ము ల వెంకటి అతనిపై కక్ష పెంచుకున్నాడు. పథ కం ప్రకారం ఈ నెల 21న గుమ్ముల తిరుపతి, వెంకటి, నర్సమ్మ, రాజబాపుతో కలిసి కొట్టిచంపారు. ఎవరికీ అనుమానం రావద్దని మృతదేహాన్ని పార్వతిబ్యారేజి కాల్వలో పడేశారు. గురువారం సీఐ నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో షెట్‌పల్లి సమీపంలో నిందితుల ను పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాయి, కర్ర, బైక్‌ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement