వెంచర్‌లో వివాదం... | - | Sakshi
Sakshi News home page

వెంచర్‌లో వివాదం...

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

● గోడ కూల్చివేసిన బాధితులు

● గోడ కూల్చివేసిన బాధితులు

లక్సెట్టిపేట: మండలంలోని సూరారంలో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వేసిన వెంచర్‌లో వివాదం నెలకొంది. బాధితులు గోడ కూల్చడంతో సమస్య తీవ్రమైంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఓ ప్రైవేటు వెంచర్‌ నిర్వాహకులు 2023లో మూడెకరాల్లో వెంచర్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 53 ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపారు. వ్యాపారుల్లో ఒక భాగస్వామి వెంచర్‌లో రహదారులకోసం తీసిన సుమారు ఎకరం భూమిని ఒకరికి విక్రయించాడు. సద రు కొనుగోలు దారుడు అట్టి ప్రదేశం చుట్టూ గోడ నిర్మాణం చేసుకున్నాడు. దీంతో అప్పటి వరకు కొనుగోలు చేసిన 30 మంది బాధితులు గురువారం గోడలు కూల్చివేశారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా మాకు ఎలాంటి సమాచారం రాలేద ని, దీనిపై పూర్తి విచారణ చేపడుతామన్నారు.

మందమర్రి వాసులకు డాక్టరేట్‌

మందమర్రిరూరల్‌: మందమర్రి మండలం సారంగపల్లి గ్రామానికి చెందిన రామగిరి శేఖర్‌, మందమర్రిలోని దొరలబంగ్లా ప్రాంతా నికి చెందిన బాసాని మంజుల డాక్టరేట్‌ సాధించారు. సారంగపల్లికి చెందిన రామగిరి లింగ య్య, రత్న దంపతుల కుమారుడు శేఖర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరే ట్‌ పొందాడు. సింగరేణిలో కోల్‌కట్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజలింగు కుమార్తె బాసాని మంజుల ఓయూ విశ్వ విద్యాలయంలో ‘నేటి విద్యావ్యవస్థ, విద్యార్థులలో విలువలను పెంపొందించడంలో దాని పాత్ర’ అంశంపై పరిశోధనలు నిర్వహించి డాక్టరేట్‌ అందుకున్నారు.

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ స మీపంలో గురువారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఘటనలో మందమర్రి మండలం బొక్కలగుట్టకు చెందిన చిప్పరి శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా ప్రమాదం జరిగింది వాస్తవమేనని, బాధితుల నుంచి ఇంకా ఫిర్యాదు రాలేదన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం అనుభవంలేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement