దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజీ పరిధిలో గల తానిమడుగు బీట్‌లో అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ సోలార్ బోర్‌వెల్ ఏర్పాటు చేసింది. బుధవారం రాత్రి నీటి కుంట వద్ద అరుదైన చిత్రం సీసీకెమెరాకు చిక్కింది. అడవి పందులు వరుసక్రమంలో సోలార్ బోర్‌వెల్ వద్ద ఉన్న నీటికుంట వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకున్నాయి. ఒకదానికి ఒకటి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణగా వచ్చి నీళ్లు తాగుతున్న వాటి సహజ ప్రవర్తన చిత్రంలో ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు. – దండేపల్లి


