తాంసి: ఐదోతరగతి చదువుతూనే గేయాలు రచించిన పొన్నారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పొన్నారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రచించిన మోదుగ మొగ్గలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయురాలు సరిత సహకారంతో విద్యార్థులు స్థానిక పండుగలు, తదితర వాటిపై గేయాలను రచించడం అభినందనీయమన్నారు. పాఠశాల హెచ్‌ఎం సుజాత, డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, సర్పంచ్ పొచ్చన్న, రచయిత ఉదారి నారాయణ పాల్గొన్నారు.


