మంచిర్యాలఅర్బన్: పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ నెల 24 నుంచి సెలవుల ప్రకటనతో వసతిగృహ విద్యాలయాల్లోని విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాలోని 684 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 18 కస్తూర్భా, 5 ఆదర్శ పాఠశాలలు, 95 గురుకులాల్లో 58,386 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 18న పరీక్షలు ముగియడంతో గురువారం ప్రోగ్రెస్ రిపోర్టు అందజేశారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చాలామంది ఆటోలు, ఇతర వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్లారు.


