మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా చేపట్టిన సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కస్తూ రి నాగరాజ్, నాయకులు అమిరిశెట్టి రాజ్‌కుమార్, కర్రె లచ్చన్న అశోక్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


