తాండూర్: మండలంలోని రాజీవ్‌నగర్ గ్రామానికి చెందిన ఉపిరే ప్రణీత్(25) అనే సింగరేణి యువ కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాండూర్ ఏఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే రిటైర్డ్ కార్మికుడు ఉప్రే కిషన్ కుమారుడు ప్రణీత్ మందమర్రి ఏరియాలోని కాసిపేట 2 గనిలో ట్రామర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారీలాగే మంగళవారం రెండో షిప్ట్ విధులు ముగించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. స్నానం చేసి తన రూమ్‌లోకి వెళ్లాడు. చాలా సేపటి వరకు టీవీ ఆన్ చేసి ఉన్నట్లు గమనించిన కిషన్ వెళ్లి తలుపు తీసి చూసే సరికి ప్రణీత్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. వెంటనే ప్రణీత్‌ను స్థానికుల సాయంతో కిందికి దించి బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ప్రణీత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన కుమారుడికి ఎలాంటి సమస్యలు లేవని ఆత్మహత్యకు ఎందుకు పా ల్పడ్డాడో అర్థం కావడం లేదని కిషన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


