వ్యాపారం కలిసి రాక.. అప్పులు తీర్చలేక.. | - | Sakshi
Sakshi News home page

వ్యాపారం కలిసి రాక.. అప్పులు తీర్చలేక..

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

జైపూర్‌: వ్యాపారం కలిసి రాలేదు. దాని కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన వ్యక్తి మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భీమారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం మండల కేంద్రానికి చెందిన పోటు తిరుపతిరెడ్డి(50) వ్యవసాయంతో పాటు ఎరువుల దుకాణాన్ని నడిపేవాడు. ఇందుకు అప్పులు చేయగా వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలోనని ఎప్పుడూ మానసికంగా బాధపడేవా డు. ఈక్రమంలో బుధవారం ఉదయం 3:30 గంట లకు పొలంకు వెళ్తున్నానని చెప్పి మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement