రోడ్డు విస్తరణ పనులు అడ్డుకున్న వ్యాపారులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ పనులు అడ్డుకున్న వ్యాపారులు

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

చెన్నూర్‌: పట్టణంలోని అంబేడ్కర్‌ చౌక్‌ నుంచి పెద్ద చెరువు రావి చెట్టు వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డ్రెయినేజీలపై ఉన్న కట్టడాలను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది, అధికారులను బుధవారం వ్యాపారులు, ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం ఎంత వరకు సమంజమన్నారు. రోడ్డు ఎన్ని ఫీట్లు వెడల్పు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తారనే వివరాలతో నోటీసులు ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు చేసేది లేక పనులు నిలిపివేశారు. శానిటరీ ఇన్స్‌స్పెక్టర్‌ ఉదయ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement