జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

● ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

కెరమెరి: సిర్పూర్‌(యూ) మండలంలోని మహా గాం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థిని బుధవా రం జ్వరంతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పాఠశాల హెచ్‌ఎం రాంబాయి తెలిపిన వివరా లు.. కోట్నక గంగుబాయి(14) 9వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి ఆమెకు జ్వరం రాగా బుధవారం పాఠశాల ఏఎన్‌ఎం జ్వరానికి సంబంధించిన మాత్ర ఇచ్చారు. అనంతరం కాసేపు బాగా నే ఉంది. అకస్మత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే అంబులెన్స్‌లో జైనూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఆదివాసీ సంఘాల ఆందోళన

గంగుబాయి మృతి చెందిన సమాచారం అందుకున్న ఆదివాసీ సంఘాల ఐకాస రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కనక యాదోరావు, ఇతర నాయకులు, మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి జైనూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా పిల్లలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తక్షణ సహాయం కింద రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న డీడీ రమాదేవి, ఏజెన్సీ డీఈవో చందన్‌, ఏపీవో భాస్కర్‌, జీసీడీవో శకుంతల, టీడీఏ శ్రీనివాస్‌, ఎంఈవో సుధాకర్‌, తహసీల్దార్‌ బీర్‌శావ్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేశారు. మృతురాలి తండ్రి కోట్నాక సొంజీకి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రం అందించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.20 వేలు అందించారు. దీంతో ఆందోళన కారులు ఆందోళప విరమించారు. పెందొర్‌ మాధవరావు, ఇంతియాజ్‌ లాలా, మెస్రం భూపతి తదితరులు ఉన్నారు. కాగా విద్యార్థిని మృతి నేపథ్యంలో డిప్యూటీ హెచ్‌డబ్ల్యూవో కె.శ్రీదేవి, ఏఎన్‌ఎం తీర్థాబాయిని సస్పెండ్‌ చేస్తూ డీడీ రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement