జేఈఈ అడ్వాన్స్‌కు సీవోఈ విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌కు సీవోఈ విద్యార్థుల ఎంపిక

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమం బెల్లంపల్లి బాలుర గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ(సీవోఈ) కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటి అడ్వాన్స్‌కు అర్హత సాధించారు. ఎంపీసీ విద్యార్థులు 33 మంది జేఈఈ పరీక్షకు హాజరు కాగా 15 మంది మెరుగైన పర్సంటైల్‌తో అడ్వాన్స్‌కు ఎంపికయ్యారు. మైలారపు విశ్వతేజ, డౌనే ఆదర్శ్‌, గోదారి అంజన్న, రాంటెంకి గిరిధర్‌, దుర్గం అభిరామ్‌, రామటెంకి హవీశ్‌, ఆవునూరి మనీష్‌, దుర్గం యశోమార్‌, జాడి జయవర్ధన్‌, కామెర బెన్నీ, కలిసి ధనుష్‌, కొండగొర్ల రామ్‌చరణ్‌, ముడిమడుగుల రామ్‌తేజ, బట్టి క్రాంతి రణదేవ్‌, మడికొండ అవినాష్‌ ఉన్నారు. అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించిన సీవోఈ విద్యార్థులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం రాత్రి ఆయన సీవోఈ గురుకులాన్ని సందర్శించారు. అడ్వాన్స్‌ పరీక్షల్లో అత్యుత్తమ పర్సంటైల్‌ తెచ్చుకుని ఐఐటీలో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను సీవోఈ ప్రిన్సిపాల్‌ విజయ్‌సాగర్‌, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement