మొక్కజొన్న పంటకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న పంటకు నిప్పు

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

కుంటాల: మండలంలోని ఓల గ్రామంలో మో రేబాబు పటేల్‌ మొక్కజొన్న పంటకు సోమవారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. స్పందించిన సర్పంచ్‌ కట్ట రవి పంచాయతీ సిబ్బందితో కలిసి పంట చేనులోకి వాటర్‌ ట్యాంకర్‌ను తీసుకెళ్లి మంటలు ఆర్పి వేశారు.

మోతక్‌పల్లిలో..

నర్సాపూర్‌(జి): మండలంలోని చాక్‌పల్లి అనుబంధ గ్రామం మోతక్‌పల్లి శివారులో సోమవారం మొక్కజొన్న పంట దగ్ధమైంది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వెలువడిన నిప్పు రవ్వలతో దగ్ధమైనట్లు రైతులు తెలిపారు. జాదవ్‌ మోతిలాల్‌ పటేల్‌కు చెందిన 4 ఎకరాల మొక్కజొన్న, జాదవ్‌ నరహరి పటేల్‌కు చెందిన ఎకరం మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement