కుభీర్: మండల కేంద్రానికి చెందిన పుప్పాల ద త్తాత్రికి చెందిన ప్యాసింజర్ ఆటో చోరీకి గురి కాగా దొడర్నా వద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 17న రాత్రి 10గంట లకు దత్తాత్రి తన ఇంటి ముందు ఆటో నిలిపి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం చూ సేసరికి ఆటో చోరీకి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకు న్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆది వారం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో చో రీకి గురైన ఆటోతో పాటు నిందితుడిని పట్టుకు ని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


