గొండ్‌గూడ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో ఆదివాసీల ర్యాలీ ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద జెండావిష్కరణ, పూజలు పాల్గొన్న ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు
ఇంద్రవెల్లి: భూమి కోసం, భుక్తి కోసం పోరాడి అసువులు బాసిన ఇంద్రవెల్లి అమరవీరులకు సోమవారం ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులర్పించారు. ముందుగా గొండ్‌గూడ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీగా స్తూపం వద్దకు వచ్చిన ఆదివా సీలు స్మారక జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. స్తూపం వద్ద ఖానాపూర్ ఎ మ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కో వ లక్ష్మి, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మాజీ ఎంపీ సోయం బాపురావ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేశ్ జాదవ్, ఆత్రం సుగుణలు పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎంపీ గోడం నగేశ్, మాజీ మావోయిస్టు పూల్లురి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్నలు అమరవీరులకు నివాళులర్పించారు.
అమరుల కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్
1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి ఘటనలో అమరులై న బాధిత కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయడంతో పా టు బాధిత కుటుంబాలకు ఇంటి స్థలాలు, ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు పటేల్ అన్నారు. ఐటీడీఏ ద్వారా వారికి ఇష్టమైన వాహనాలను రాయితీపై మంజూరు చేశామని, మిగితా బాధిత కుటుంబాలను కూడా గుర్తించి ఆదుకుంటామని తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం ముసుగులో కొంత మంది గిరిజన, గిరిజనేతర నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇ ప్పటి వరకు పరిష్కారం కాని పోడు భూముల కో సం, రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న అటవీ చట్టాలకు వ్యతిరేకంగా, తాగు నీటి స మస్య పరిష్కారానికి పోరాటాలు చేయాలి కానీ తమ స్వార్థం కోసం ఆదివాసీ సమాజాన్ని పక్కదారి పట్టించడం సరికాదన్నారు. న్యాయమైన హ క్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తే మద్దతిస్తామని పేర్కొన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని, వాటిపై దాడులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్‌కు సూచించారు. అనంతరం అమరవీరు ల ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు ఆత్రం భుజంగ్‌రావ్ ఆధ్వర్యంలో ముద్రించిన ‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు చించు రామకృష్ణ, వీరమల్లు, ఆశారెడ్డి, వెంకట్‌రావ్, మనోహర్, అమృత్‌రావ్, గణేశ్, బాపురావ్, అమరవీరుల ఆశయ సాధన సమితి చైర్మన్ మెస్రం నాగ్‌నాథ్, వైస్ చైర్మన్ సోయం రాందాస్, నాయకులు గేడం భరత్ తదితరులు ఉన్నారు.
తొడసం కట్టికి ఘన నివాళి
ఇంద్రవెల్లిలో జరిగిన సభకు సారథ్యం వహించిన ఉద్యమ సారథి తుమ్మగూడ గ్రామానికి చెందిన తొడసం కట్టి స్మారక జెండా వద్ద సోమవారం తుమ్మగూడ గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాపోరాటంతోనే సమస్యలు పరిష్కారం..
ప్రజాపోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాద్‌రావ్ అలియాస్ చంద్రన్న అన్నారు. సోమవారం ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామాన్ని సందర్శించి ఉద్యమ కారుడు సిడాం శంభు సమాది వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు నిర్భందం విధించినా ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన సిడాం శంభు చరిత్రలో నిలిచిపోయాడని గుర్తు చేశారు. ప్రజా పోరాటాలతోనే న్యాయమైన హక్కులు సాధించుకోవచ్చన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి చేరుకుని అమరులకు నివాళులర్పించారు.


