బాల్య వివాహం అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం అడ్డగింత

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

నార్నూర్‌: అమ్మాయికి కేవలం 13 ఏళ్లు మాత్రమే. ఆటపాటలతో గడపాల్సిన వయసు అది. కానీ ఆ కుటుంబం బాలికకు పెళ్లి చేయాలని నిశ్చయించింది. అన్నీ సిద్ధమయ్యాయి. సోమవారం ముహూర్తం కూడా ఖరారైంది. విషయం తెలుసుకున్న గాదిగూడ ఎస్సై జి.రమ్య తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. పెళ్లిని అడ్డుకుని బాలిక భవిష్యత్తుకు భరోసానిచ్చారు. జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతం, మహారాష్ట్ర సరిహద్దు గ్రామం గాదిగూడ మండలంలోని మేడిగూడలో సోమవారం జరగాల్సిన బాల్య వివాహాన్ని ఎస్సై అడ్డుకున్నారు. బాల్య వివాహం ఎందుకు చేయకూడదో కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అర్థమయ్యేలా వివరించారు. పోలీసుల మాటలతో కళ్లు తెరిచిన కుటుంబ సభ్యులు, తమ తప్పు తెలుసుకుని వివాహాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సకాలంలో స్పందించి చిన్నారి జీవితం చితికిపోకుండా కాపాడిన ఎస్సై రమ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement