ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్తూపానికి మరో ఎకరం భూమి కేటాయించడంతో పాటు అమరుల కుటుంబాలకు ఐదెకరాల సాగు భూమి, పింఛన్ సౌకర్యం కల్పించాలి. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
– ఆత్రం భుజంగ్‌రావ్,
అమరవీరుల ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు
గాయపడ్డ వారినీ
ఆదుకోవాలి
ప్రభుత్వం అమరులైన 15 మంది కుటుంబాలను గుర్తించినట్లు నాడు గాయాల పాలైన వారినీ గుర్తించాలి. బాధిత కుటుంబాలకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ల్లు మంజూరు చేయాలి. స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.
– మెస్రం నాగ్‌నాథ్,
అమరవీరుల ఆశయ సాధన సమితి చైర్మన్


