‘రియల్‌’ అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

‘రియల్‌’ అంతంతే..

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

ఏటా తగ్గుతున్న సర్కారు ఆదాయం

‘ఎల్‌ఆర్‌ఎస్‌’తో గతేడాది కొంత మెరుగే

ఈసారి తగ్గిన రూ.3 కోట్ల ఆదాయం

తగ్గుతున్న భూముల క్రయవిక్రయాలు

బంగారంపై పెట్టుబడులూ కారణమే..

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో 2022–23 ఆర్థిక సంవత్సరం తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. అప్పటివరకు బాగా నే ఉన్నా ఆ తర్వాత ఆదాయం తగ్గుతూ వస్తోంది. ‘రియల్‌’ వ్యాపారం ఒక్కసారిగా పెరిగి, క్రమక్రమంగా తగ్గిపోతుండడం, ప్రజలకు అందుబాటులో లేనివిధంగా భూముల ధరలు పెంచడంతోనే క్రయవిక్రయాలు ఏటా తగ్గిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఏటా పెరగాల్సిన ఆదాయం తగ్గుతుండడంతో పాటు రిజిస్ట్రేషన్‌ అయ్యే డాక్యుమెంట్లు కూడా తగ్గుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘రి యల్‌’ వ్యాపా రం బాగా సాగుతుందని, భూ ముల విలువ అమాంతంగా పెంచడంతోనూ వ్యాపారంపై ప్రభావం పడింది. ‘రియ ల్‌’ వ్యాపారులు పెంచిన భూ ముల ధరలు, ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్‌ చార్జీలు సామాన్యులు భరించడం కష్టంగా మారింది. దీంతో క్రమక్రమంగా ఏటా భూముల రిజిస్ట్రేషన్‌ అయ్యే డాక్యుమెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతోంది.

గతేడాది కొంత మెరుగే..

మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 2023–24లో 20,173 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా, రూ.53.02 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 –25లో 13,881 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ కాగా, రూ.53.20 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో 25శా తం రాయితీ ప్రకటించడంతో పాటు 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోని వారికి నేరుగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు 25శాతం రాయితీతో చెల్లించి, వారి భూములు అ మ్ముకునేందుకు అవకాశం కల్పించడంతో గతేడాది కొంత మెరుగైన ఆదాయాన్ని పొందింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పుణ్యమాని గతేడాది మార్చిలోనే దాదాపు రూ.4 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.3 కోట్ల మేర ఆదాయం తగ్గింది. భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరగడం లేదు. కొత్త వెంచర్లు ఏర్పా టు కావడంలేదు. గతంలోని వెంచర్లలోని ప్లాట్లు అమ్ముడుపోవడం లేదు. అవసరం నిమిత్తమే కొనేవారితో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతోంది. భూముల ధర కంటే బంగారం ధరలు అమాంతంగా పెరుగుతుండడంతో పలువురు గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఇతర వ్యాపారాలపై దాని ప్రభావం పడుతోంది.

మంచిర్యాల ‘సబ్‌రిజిస్ట్రార్‌’ లో రిజిస్ట్రేషన్ల వివరాలు

సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఆదాయం (రూ.కోట్లలో)

2021-22 16,758 42.77

2022-23 20,038 57.08

2023-24 20,173 53.02

2024-25 13,881 53.20

2025-26 14,955 50.86

Advertisement
 
Advertisement
Advertisement