మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

రామకృష్ణాపూర్‌: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌కు స్పష్టమైన వైఖరి ఉందని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందకపోవటానికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ చేస్తున్న ప్రచారం అసత్యమని పేర్కొన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించాలనే ఉద్దేశంతో 2008లో బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో అప్పుడు మెజార్టీ లేక ఆమోదం పొందలేదని పే ర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారత కోసం నిజమైన చిత్తశుద్ధి కలిగిన పార్టీ కాంగ్రెస్సేనని స్ప ష్టంచేశారు. 2023లో బీజేపీ ప్రభుత్వం బిల్లు ఆమోదించినప్పటికీ దానిని వెంటనే చట్టంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పునర్విభజనతో బిల్లును అనుసంధానం చేసి రాజకీయ లాభం పొందాలని చూస్తోందని విమర్శించారు. మహిళల హ క్కులు రాజ్యాంగబద్ధమైనవని, వాటి సాధనకు కాంగ్రెస్‌ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టంచేశారు. ఆయన వెంట పట్టణ మాజీ అధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు వొడ్నాల శ్రీనివాస్‌, కూతురు ప్రభాకర్‌, గుర్రం శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement