నస్పూర్: సింగరేణి సంరక్షణే ధ్యేయమని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పే ర్కొన్నారు. ఆదివారం ఆయన నస్పూర్ శ్రీరాంపూ ర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. హెచ్‌ఎంఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీకి హెచ్‌ఎంఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని పే ర్కొన్నారు. సింగరేణి కార్మికులు, ప్రజలంతా మద్ద తు తెలుపాలని కోరారు. సింగరేణిలో ఏడాదికి ఐ దు కొత్త బొగ్గు బావులు, మెడికల్ బోర్డు ఏర్పాటు, మారు పేర్ల సమస్య పరిష్కారానికే కవితతో కలిసి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కవిత పార్టీ ఏర్పాటు త ర్వాత సింగరేణిలో కై రిగూడ నుంచి సత్తుపల్లి వరకు ‘బొగ్గుబాయి బాట’ నిర్వహిస్తామని తెలిపారు. హ క్కులు సాధించడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ విఫలమయ్యాయని ఆరోపించారు. దేశంలో ఎక్క డా లేనట్లు ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి ప డ్డ రూ.53 వేల కోట్లు వెంటనే చెల్లిస్తే కొత్త బొగ్గుబా వులు తెరవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కవిత పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సారయ్య, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రె సిడెంట్ అనిల్‌రెడ్డి, నాయకులు అశోక్, కొముర య్య, రాజశేఖర్, సురేశ్, లక్ష్మణ్ తదితరులున్నారు.


