మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ సంస్థ రక్షణ, సమస్యల సాధనకు ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మె చేపట్ట నున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మే కల దాసు పేర్కొన్నారు. టీజీఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆదివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇ చ్చిన హామీలు రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవటంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడు తూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా వేలాది మంది కార్మిక కుటుంబాల బతుకుదెరువుకు చేస్తున్న ఉ ద్యమమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.. మహాలక్ష్మి బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత క ల్పించాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.లక్ష్మణ్, రీజినల్ అధ్యక్షుడు మామిడిపెల్లి శ్రీనివాస్, యూనియన్ డిపో అధ్యక్షుడు పోలు రాజేశం, చైర్మన్ శ్రీనివాసులు, టీఎంయూ డిపో సెక్రటరీ తిరుపతి, మహిళా కార్మికులు జ్యోతి, ప్రభావతి, పుష్పలత, చంద్రకళ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


