చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిందేమీలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన నిధులతోనే పనులు చేస్తున్నారని, కొత్తగా ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆదివారం స్థానిక కొత్తగూడెం కాలనీలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. 16వ వార్డు మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్‌తోపాటు కొత్తగూడెం, చింతలగూడెం కాలనీలకు చెందిన వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరగా, గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ.. చెన్నూర్ వంద పడకల ఆస్పత్రి, బస్సు డిపో పనులు నిలిచిపోయాయని తెలిపారు. మంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చెన్నూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు వాల శ్రీనివాస్‌రావు, ఎన్నపురెడ్డి బాపురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుపతి తదితరులున్నారు.


