ప్రత్యేక సర్వే నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సర్వే నిర్వహించాలి

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

నస్పూర్‌: నేతకానీలకు ప్రత్యేక కులగణన సర్వే నిర్వహించాలని నేతకాని మహర్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కర్‌ రాంబాబు కో రారు. ఆదివారం ఆయన నస్పూర్‌ శ్రీరాంపూర్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో నేతకానీలు సుమారు 15లక్షలకు పైబడి జనాభా ఉన్నప్పటికీ ఇటీవల జరిపిన కుల గణనలో లక్షా 70వేల జనాభా మాత్రమే ఉన్నట్లు చూపించారని ఆరోపించారు. నేతకానీ లను మాలలతో కలపడంతో తాము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నేతకానీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ చైర్మన్‌ను నియమించాల ని, ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమ ల్లు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజు, జిల్లా మహిళా ఽఅధ్యక్షురాలు కామెర అ నూష, నాయకులు జాడి తిరుపతి, శ్రీనివాస్‌, దుర్గం శివరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement