మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిస్థితి అధ్వానంగా మారింది. ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ లేదు. మూడేళ్లుగా ఎలాంటి నిధులు రావడం లేదు. ఇటీవల కాయకల్ప కింద జిల్లాలోని ప లు మండల, అర్బన్ పీహెచ్‌సీలకు రూ.50 వేల నుంచి రూ.2లక్షల వరకు నిధులు మంజూరైనా హాజీపూర్ పీహెచ్‌సీకి మాత్రం రా లేదు. ఆరుబెడ్ల పీహెచ్‌సీ భవనం పాతది కా వడంతో నిత్యం విద్యుత్ వైరింగ్, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు కాలిపోతున్నాయి. ఆపరేషన్ థియేటర్‌లోని ఏసీ, విద్యుత్ వైరింగ్ షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయాయి. దీంతో ఆస్పత్రి లోని ఓటీ గది స్టోర్ రూంగా మారింది. రోగులకు తాగునీటి వసతి కూడా లేదు. ఇప్పటికే మినరల్ వాటర్ యజమానికి రూ.వేలల్లో డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. ఆస్పత్రిలో ఫార్మసిస్ట్ లేక సిబ్బందే రోగులకు మందులు ఇస్తున్నారు. వడదెబ్బ చికిత్సకు అ వసరమైన మందులు అందుబాటులో ఉన్నా యి. ముల్కల్ల సబ్ సెంటర్‌కు మాత్రం ఎంఎల్‌హెచ్‌పీ వైద్యురాలు ఉండగా దొనబండ, కర్ణమామిడి, నంనూర్ సబ్ సెంటర్లకు ఎంల్‌హెచ్‌పీవోలు లేక రోగులకు సేవలందడం లేదు. నంనూర్–1, ముల్కల్ల సబ్ సెంటర్‌లో రెండు ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మంచిర్యాలటౌన్: రోగులకు మెరుగైన సేవలందించాల్సిన జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరై న మౌలిక వసతులు కరువయ్యాయి. వైద్యులు, సి బ్బంది సరిపడా లేక రోగులకు పూర్తిస్థాయి సేవలందడం లేదు. ఫ్యాన్లు, తాగునీటి వసతి లేక కొన్ని ఆ స్పత్రుల్లో వేసవిలో రోగులు ఇబ్బంది పడుతున్నా రు. మంచిర్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అ నుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రిలో సరిపడా ఫ్యాన్లు లేక రోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాగునీటి కోసం ఇటీవలే వాటర్ ప్యూరిఫైర్‌లు మరమ్మతు చేశారు. నిత్యం 300 ఓపీ ఉంది. వివిధ వ్యాక్సిన్ల కోసం మరో 60 మంది నిత్యం వస్తుంటారు. ఓపీతో పాటు వ్యాక్సిన్ వేసే విభాగం రెండూ ఒకేచోట ఉన్నాయి. వీటిలో పాడైన ఫ్యాన్లకు మరమ్మతు చేపట్టకపోవడంతో వే సవిలో రోగులు ఉక్కపోత భరించలేకపోతున్నారు. వార్డుల్లో నిత్యం 150 మంది వరకు వివిధ వ్యాధులతో వచ్చి చికిత్స పొందుతున్నారు. వార్డుల్లోని కొన్ని ఫ్యాన్లూ పనిచేయడం లేదు. వేసవికి ముందే పాడైన ఫ్యాన్లకు మరమ్మతు చేయగా మళ్లీ ఏదో ఒకచోట పాడవుతూనే ఉన్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఉక్కపోత ఇబ్బందులు తప్పడం లేదు.
దండేపల్లిలో రెగ్యులర్ వైద్యుడు లేక..
దండేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మందుల కొరత లేదు. వసతులు బాగా నే ఉన్నాయి. రెగ్యులర్ డాక్టర్ లేక కాంట్రాక్ట్ వైద్యురాలితో పాటు మండలంలోని పల్లె దవాఖానాల్లో ప నిచేసే ఎంఎల్‌హెచ్‌పీలను రోజుకొకరిని అందుబా టులో ఉంచి సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులను పరీక్షలు నిర్వహించి మందులు ఇదిస్తున్నారు. అవసరమైనవారికి సైలెన్స్ ఎక్కిస్తున్నారు.
పెద్ద జబ్బు చేస్తే పెద్దాస్పత్రులకే..
చెన్నూర్: చెన్నూర్ ఏరియా ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. సాధారణ వ్యాధులకే చికిత్స అందుబాటులో ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, కు క్క, కోతి, ఎలుక కాటు మందులు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సేవలందించేందుకు అల్ట్రాస్కానింగ్ సౌకర్యం లేదు. పెద్ద జబ్బులతో బాధ పడేవారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించాల్సిన ప రిస్థితి నెలకొంది. రేడియాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఎని స్తీయా వైద్యులు లేక ప్రమాద బాధితులను మంచి ర్యాల ప్రభుత్వాత్రికి తరలించాల్సిన దుస్థితి ఉంది.
అంగ్రాజ్‌పల్లిలో అందని హోమియో వైద్యం
చెన్నూర్‌రూరల్: మండలంలోని అంగ్రాజ్‌పల్లి ప్రా థమిక ఆరోగ్యకేంద్రంలో నిత్యం 60 నుంచి 70 వర కు ఓపీ ఉంటుంది. ఓఆర్‌ఎస్, సైలెన్ బాటిళ్లు, మందులు సరిపడా ఉన్నాయి. పేషెంట్లకు చికిత్స చేసే గదిలో ఫ్యాన్లున్నాయి. ల్యాబ్‌లో టెస్టులు చేసేందు కు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఫార్మసిస్ట్ లేరు. ఇక్కడ పని చేసే కాంట్రాక్ట్ హోమి యో వైద్యురాలు వేరే ఉద్యోగం వచ్చి వెళ్లగా 11 నెలలుగా పోస్టు ఖాళీగా ఉంది. హోమియో వైద్యం అందక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
అధ్వానంగా హాజీపూర్ పీహెచ్‌సీ


