కోటపల్లి: ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా రవాణా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాములు హెచ్చరించారు. మంగళవారం రాపన్‌పల్లి సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ప్రాణహిత నది వంతెన వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ప్రారంభించారు. జిల్లాలోని రైతులకు మద్దతు ధర అందించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు ఈ చెక్‌పోస్టును ప్రారంభించినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో 24గంటలు నిరంతరం నిఘా పెడతామని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ద్వారా వాహనాల తనిఖీ క్రమం తప్పకుండా చేపడతామని, నియమావళిని ఉల్లఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బ్రహ్మారావు, తహసీల్దార్ రాఘవేందర్‌రావు, ఏవో సాయికృష్ణారెడ్డి, సీఐ కృష్ణ పాల్గొన్నారు.


