అక్రమ నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ఇందిరమ్మకాలనీ వెనకాల బుధాకలాన్‌ గ్రామ సర్వే నంబర్‌ 170లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమార్కులు గుట్టుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మించి విక్రయిస్తున్న తీరుపై మంగళవారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి తహసీల్దార్‌ ఎల్‌.కృష్ణ స్పందించారు. మంగళవారం గిర్దావర్‌ రమేశ్‌, పంచాయతీ అధికారి, ఇతర సి బ్బంది వెళ్లి ఇళ్లు, షెడ్లను ట్రాక్టర్‌తో కూల్చివేయించారు. ప్లాట్లుగా చేసి హద్దుల కోసం ఏ ర్పాటు చేసిన సిమెంట్‌ స్తంభాలను ధ్వంసం చేయించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్లు, షెడ్లు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement