సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. సూర్యప్రతాపంతో వేడి పెరుగుతోంది. సాయంత్రం 6గంటలు దాటినా వాతావర ణం చల్లబడడం లేదు. జిల్లావాసులు పెరుగుతున్న వేడిని తట్టుకోలేక పోతున్నారు. మంగళవారం మందమర్రిలో ఒకరు వడదెబ్బతో మృతి చెందారు. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత పరిశీలిస్తే ఇదేరోజు 42.8 డిగ్రీల సెల్సీయస్‌గా ఉండగా, మంగళవారం 43.4 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. అంటే, ఈసారి 1.2 డిగ్రీలు అధికంగా ఉంది. గ్రామాల్లో ఇంకా వ్య వసాయ పనులు పూర్తి కాలేదు. వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ధాన్యం ఆరబెట్టడం, కేంద్రాలకు తరలింపు, కాంటాపూర్తయి రవాణా చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ఉపాధి పనులు జోరందుకుంటాయి. రోజువారీగా పనులు చేసుకునే వా రు, వీధి వ్యాపారులు, ఇతర పనులు చేసుకునే వా రంతా ఎండవేడిమి తట్టుకోవడం లేదు. వేడిని తట్టుకునేందుకు స్థాయిని బట్టి పలువురు ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తుండడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది.
జాగ్రత్తలు తప్పనిసరి
వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా పా టించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండకు వెళ్లకపోవడమే ఉత్త మం. ఒంట్లో నీరు తగ్గకుండా తగినంత ద్రవాలు తీసుకోవాలి. ఒకవేళ డీ హైడ్రేషన్‌కు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలుంటే సమీప ఆస్పత్రికి వెళ్లాలి.
మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు
మండలం గ్రామం కనిష్టం గరిష్టం
దండేపల్లి వెల్గనూరు 32.1 43.8
భీమారం భీమారం 31.9 43.7
నస్పూర్ జీఎం ఆఫీస్ శ్రీరాంపూర్ 32.6 43.2
చెన్నూరు కొమ్మెర 32.8 43.2
జైపూర్ కుందారం 31.4 43.1
మందమర్రి
అందుగులపేట 33.5 42.7
కాసిపేట కొండాపూర్ 36.4 42.4
దండేపల్లి లింగాపూర్ 35.4 42.4
నస్పూర్ నస్పూర్ 31.8 42.4
బెల్లంపల్లి బెల్లంపల్లి 33.4 42.4
హాజీపూర్ ర్యాలీ 33.1 42.2
కన్నెపల్లి జన్కాపూర్ 34.0 42.2
భీమిని భీమిని 34.5 42.1
తాండూరు తాండూరు 34.6 42.1
కోటపల్లి దేవులవాడ 32.9 41.9
హాజీపూర్ హాజీపూర్ 33.6 41.7
జన్నారం జన్నారం 36.6 41.6
లక్సెట్టిపేట శాంతాపూర్ 33.1 41.3
వేమనపల్లి నీల్వాయి 31.2 41.3
కన్నెపల్లి కన్నెపల్లి 32.6 41.2
నెన్నెల నెన్నెల 31.6 41.0
కోటపల్లి కొల్లూరు 32.9 41.0
కోటపల్లి కోటపల్లి 32.1 40.9
జన్నారం తపాలాపూర్ 34.9 40.7
చెన్నూరు చెన్నూరు 32.9 40.7


