కమీషన్ల కోసమే కేసీఆర్‌ ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసమే కేసీఆర్‌ ఉద్యమం

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

● రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి ● జైపూర్‌లో సర్పంచులకు సన్మానం ● చెన్నూర్‌లో లబ్ధిదారులకు చెక్కులు

జైపూర్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌, యాదాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మించి రూ.వేల కోట్లు దండుకున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. ప్రస్తుతం మళ్లీ ఉద్యమిస్తామని మాజీ సీఎం కేసీఆర్‌ ప్రకటించడం కమీషన్లు దండుకోవడానికేనని విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. గోదావరి తీర ప్రాంతాల్లో బొగ్గు, నీరున్న వద్ద పవర్‌ ప్రాజెక్ట్‌లు నిర్మించకుండా యాదాద్రిలో నిర్మించి రూ.25వేల కోట్లు ఖర్చు చేశారని, వనరులున్న వద్ద కాకుండా కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు నిర్మించారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని, రూ.60వేల కోట్ల నుంచి రూ.8లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. చెన్నూర్‌ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక సీసీ రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

‘కాళేశ్వరం’ పేరుతో ప్రజాధనం వృథా

చెన్నూర్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరిట గత ప్రభుత్వం రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చెన్నూర్‌ నియోజకవర్గంలో బాల్క సుమన్‌ హయాంలో వచ్చిన నిధులతోనే కాంగ్రెస్‌ అభివృద్ధి చేస్తోందని ఆరోపించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నిధులు తేస్తే ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే ప్రజలు నిన్ను ఎందుకు ఓ డగొట్టారో ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలిపారు. యువకులు జర్మనీలో ఉపాధి పొందేందుకు ఎమ్మె ల్యే కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూ చించారు. డిప్యూటీ తహసీల్దార్‌ సనత్‌కుమార్‌, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ, వైస్‌ చైర్మన్‌ వినయ్‌కుమార్‌, కౌన్సిలర్లు అంబాటి శంకర్‌, కొమ్మెర జయలక్ష్మి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు

అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం నుంచి మంజూరైన సెల్‌ఫోన్లను రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. సీడీపీవో మనోరమ, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement