మంచిర్యాలటౌన్: ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ, డీసీ సీ అధికార ప్రతినిధి రఘునాథ్‌రెడ్డితో కలిసి ఎంపీ సుమారు 200 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో మాట్లాడి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. అర్హులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులను ప్రణా ళికాబద్ధంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. బొ క్కలగుట్ట, పులిమడుగు, అందుగులపేట పొలాల మీదుగా మామిడిగూడెం వరకు పాతరోడ్డు మంజూరు గురించి స్థానికులు ఎంపీకి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎంపీతోపాటు కలెక్టర్ రోడ్డు నిర్మాణానికి రూ.50లక్షల వరకు నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.


