లక్సెట్టిపేట: ఈ నెల 19న ‘కిడ్నీ రోగులకు ఊరట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారి అనిత, ఆర్‌ఎంవో శ్రీధర్ స్పందించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఏర్పా టు చేయనున్న డయాలసిస్ సెంటర్‌ను పరి శీలించారు. డయాలసిస్ గదిలో ఉండాల్సిన సౌకర్యాలు పరిశీలించారు. తక్షణమే సెంటర్ ను ప్రారంభించి రోగులకు వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యులు ప్రసాద్, ప్రశాంతి, సిబ్బంది పాల్గొన్నారు.


