మంచిర్యాలఅగ్రికల్చర్: కుల వివక్ష నిర్మూలన కోసం బసవేశ్వర చేసిన కృషి చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాములు, సంక్షేమశాఖ అధికారులు భాగ్యవతి, దుర్గప్రసాద్ బసవేశ్వర చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో స మానత్వం శ్రామిక గౌరవం, కుల వివక్ష నిర్మూలన, నైతిక విలువల ప్రోత్సాహం కోసం బసవేశ్వర చేసిన కృషి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.


