జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలోని 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలందరికీ ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేస్తున్నాం. బాలికలతో పాటు తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తు న్నా వ్యాక్సిన్ వేసుకునేందుకు కొందరే ముందుకు వస్తున్నారు. దీంతో గ్రామాలు, పట్ట ణాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాం. గర్భాశయ క్యాన్సర్ వస్తే దానిని ఎదుర్కోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది ప్రజల కు మరింతగా అవగాహన కల్పించి, అర్హులై న బాలికలందరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ అనిత, జిల్లా వైద్యాధికారి


