ప్రభుత్వ స్థలం కబ్జా..! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలం కబ్జా..!

Apr 21 2026 4:20 AM | Updated on Apr 21 2026 4:20 AM

సెంట్‌ భూమినీ వదలని అక్రమార్కులు

ప్లాట్లుగా చేసి గుట్టుగా అమ్ముకుంటున్న వైనం

పెట్టుబడి లేని వ్యాపారంగా మారిన భూ కబ్జాలు

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

బెల్లంపల్లి: ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు సెంట్‌ భూమిని సైతం వదలడం లేదు. విలువైన భూములను కబ్జా చేసి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ శివారు బుధాకలాన్‌ సర్వేనంబర్‌ 170లో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే ఆక్రమణకు గురైంది. మిగిలి ఉన్న కొద్దిపాటి భూమికూడా పరాధీనం అవుతోంది. బెల్లంపల్లి ఆర్ముడ్‌ రిజర్వుడు, ఇందిరమ్మ కాలనీ వెనకాల ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు హద్దురాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడక్కడ దర్జాగా శాశ్వత కట్టడాలు కడుతున్నారు. నిరుపేదలను ముందుపెట్టి కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఒక్కో ప్లాట్‌కు రూ.4లక్షలు

కబ్జా చేసిన స్థలంలో అక్రమార్కులు షెడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. ఓపెన్‌ ప్లాట్లను రూ.4 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. నయాపైసా పెట్టుబడి లేకుండా కబ్జాలకు తెరలేపి లక్షలు కూడబెట్టుకుంటున్నారు. ఈ దందా లాభసాటిగా ఉండటంతో సెంటు భూమి కూడా మిగలకుండా ఆక్రమిస్తున్నారు.

చేతులు మారిన ఇందిరమ్మ ఇళ్లు

గురిజాలకు వెళ్లే మార్గంలో దశాబ్దకాలం క్రితం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఈ స్థలాన్ని నిర్ధేశించగా క్రమంగా పరాధీనమైంది. నిజమైన లబ్ధిదారులు పదిమందికి మించి లేనట్లు తెలుస్తోంది. అట్టి భూమిపై అర్ధంతరంగా ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లపై కన్నేసిన ఓ మాజీ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు ఏకంగా రియల్‌ ఎస్టేట్‌ దందా నిర్వహించారు. కొందరి ఇందిరమ్మ ఇళ్లను కబ్జా చేసి, మరికొందరి ఇళ్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒక్కో ఇంటిని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు చేయడంలో ఆరితేరిన ఓ మహిళ సంబంధిత అధికారులతో కుమ్మకై ్క పేదల ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను అక్రమించి అమ్ముకున్న సంఘటన అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మిగిలి ఉన్న భూమిని కబ్జా చేయడానికి పక్షం రోజుల నుంచి గుట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సీవోఈ గురుకులం కోసం...

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకు ల సెంటర్‌ ఆఫ్‌ఎక్స్‌లెన్సీ (సీవోఈ )పాఠశాల/కళాశాల ప్రహరీని ఆనుకుని ఉన్న ప్రభు త్వ భూమి భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగపడేలా ఎవరికీ కేటాయించలేదు. మూ డేళ్లక్రితం అప్పటి ఆర్డీవో హరికృష్ణ దగ్గరుండి సర్వే చేయించారు. భూ ఆక్రమణ జరగకుండా హద్దులు ఏర్పాటు చేయించారు. ఖాళీ భూమిని సీవోఈ అనుబంధంగా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు ఉపయోగించాలని, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో ప్రకటించారు. కానీ ఆయన బదిలీపై వెళ్లిపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే షెడ్లను ఏర్పాటు చేసి కబ్జా పర్వం సా గిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అటువైపు తొంగి చూ డక పోవడం ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై తహసీల్దార్‌ కృష్ణను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement