మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

Apr 21 2026 4:20 AM | Updated on Apr 21 2026 4:20 AM

● రాష్ట్ర ఎలక్ట్రోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి ● కలెక్టర్‌, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికా రులు, సహాయ ఎన్నికల అధికారులతో ఓటర్ల ప్ర త్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో త్వరలో చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితాను ఏబీసీడీ కేటగిరీలుగా విభజించి మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు ఇంటింటా సందర్శించి వివరాలు సేకరించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో మ్యాపింగ్‌ చేసుకునేలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన బూత్‌ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో స్పష్టమైన జాబితా రూపకల్పన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement