మంత్రులను కలిసిన ఐఎన్‌టీయూసీ నేతలు | - | Sakshi
Sakshi News home page

మంత్రులను కలిసిన ఐఎన్‌టీయూసీ నేతలు

Apr 21 2026 4:20 AM | Updated on Apr 21 2026 4:20 AM

శ్రీరాంపూర్‌: సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బీ జనక్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో నేతలు సోమవారం రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ని సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ, ఇతర అధికారులను కలిసి వినతిపత్ర ం అందించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కార్పొరేట్‌ మెడికల్‌ బోర్డును తక్షణమే నిర్వహించి 95 శాతం కార్మికులను మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ చేయాలని, మెడికల్‌ ఫిట్‌ పూర్తయిన 400 మంది డిపెండెంట్‌లకు ఉద్యోగాలు ఇవ్వాలని, నూతన గనులను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలవె న్స్‌లపై కార్మికులు చెల్లిస్తున్న ఆదా య పన్ను సంస్థనే చెల్లించాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, మెరుగైన క్యాడర్‌ స్కీమ్‌, ఇన్సె ంటివ్‌ వంటి సమస్యలు పరిష్కరించాలని కో రారు. మంత్రులను కలిసిన వారిలో యూ ని యన్‌ కేంద్ర సీనియర్‌ ఉపాధ్యక్షులు నరసింహా రెడ్డి, పీ.ధర్మపురి, త్యాగరాజన్‌, కాంపెల్లి సమ్మ య్య, జెట్టి శంకర్‌రావు, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement