బంగారం దుకాణంలో.. | - | Sakshi
Sakshi News home page

బంగారం దుకాణంలో..

Apr 20 2026 9:11 AM | Updated on Apr 20 2026 9:11 AM

తానూరు: మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో ఉన్న పి.సాయిప్రసాద్‌ బంగారు ఆభరణాలు తయారుచేసే దుకాణంలో చోరీ జరిగినట్లు ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపారు. శనివారం రాత్రి దుండగులు దుకాణం షెటర్‌ పైకిలేపి లోనికి చొరబడ్డారు. దుకాణంలో ఉన్న 300 గ్రాముల వెండి ఆభరణాలు అపహరించారు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచి ఉండడంతో గమనించిన స్థానికులు యాజమానికి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై దుకాణంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి క్లూస్‌టీం సిబ్బందిని రప్పించడంతో వేలిముద్రలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement