శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానం ఆత్మీయ కలయికకు.. అనుబంధాలకు వేదికై ంది. ఆదివారం ‘ప్రగతి స్టేడియం పిలు స్తోంది.. రా’ పేరుతో మహా ఆత్మీయ సమ్మేళనం ని ర్వహించారు. ముందుగా సంత మైదానం నుంచి ప్రగతి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అన ంతరం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ శ్రీనివాస్, ఏఐటీయూసీ అధ్యక్షు డు వీ.సీతా రామయ్య హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావనీర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 34 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ మైదానం ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిందన్నారు. ఇక్కడి సీ ఈఆర్ క్లబ్‌లో ఎంతోమంది కళాకారులు తమ కళ ను మెరుగుపర్చుకోవడానికి వేదికై ందన్నారు. అనేక మంది క్రీడాకారులు, కళాకారులు ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించారన్నారు. రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులను ఒకే వేది కపై చేర్చిన నిర్వాహక కమిటీని వక్తలు అభినందించారు. సింగరేణి ప్రగతిని కీర్తించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌వోటు జీఎం సత్యనారాయణ, రిటైర్డ్ జీఎంలు పురుషోత్తం, జయరావు, పాండురంగారావు, ప్రేంకుమార్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, డీవైఎస్‌వో హన్మంతరెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్పొరేటర్ వేల్పుల రవీందర్, నిర్వాహక కమిటీ కోఆర్డినేటర్ యాదిరెడ్డి పాల్గొన్నారు.


