ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య

Apr 20 2026 9:11 AM | Updated on Apr 20 2026 9:11 AM

ముధోల్‌: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్ల పెర్సిస్‌ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని కాల్వ గల్లీకి చెందిన కారగిరి రాందాస్‌(45) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతని భార్య లేచి చూసేసరికి ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

వడదెబ్బతో మహిళ మృతి

నెన్నెల: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గుండ్లసోమారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన చల్లూరి రుక్మ (55) తమ కూతురు శోభతో కలిసి ప్లాస్టిక్‌ కవర్లతో ఏర్పాటు చేసిన గుడిసెలో నివాసం ఉంటోంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన ఎండకు ప్లాస్టిక్‌ కవర్‌ కిందనే ఉన్న రుక్మకు వడదెబ్బ తాకింది. దీంతో వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురైంది. కూతురు శోభ 108కు సమాచారం అందించడంతో గ్రామస్తుల సాయంతో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement