మానవత్వంతో వైద్యం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మానవత్వంతో వైద్యం చేయాలి

Apr 20 2026 9:11 AM | Updated on Apr 20 2026 9:11 AM

● ఏపీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ నర్సింహులు

నిర్మల్‌చైన్‌గేట్‌: వైద్యులు మానవత్వంతో వైద్యం చేయాలని ఏపీఐ (అసోసియేషన్‌ ఫిజీషియన్‌ ఆఫ్‌ ఇండియా) జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీ.నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ బ్యాంకెట్‌ హాల్లో ఆదివారం ఏపీఐ తెలంగాణ చాప్టర్‌, ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ దామెర రాములు ఆధ్వర్యంలో ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నర్సింహులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొదటిసారిగా ఈ సభ నిర్మల్‌లో నిర్వహించడం హర్షనీయమన్నారు. ఆన్‌లైన్‌పై ఆధారపడి, సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. వైద్య విద్యను అభ్యసించి, అనుభవంతో కూడిన చికిత్స అందించే వైద్యుల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ రాజారావు, రాష్ట్ర బాధ్యులు ప్రొఫెసర్‌ నావల్‌ చంద్ర, ప్రొఫెసర్‌ చందర్‌, ప్రొఫెసర్‌ రమేశ్‌, ప్రొఫెసర్‌ పవన్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement