మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 20 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీవైఎస్‌వో హనుమంత రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 27 నుంచి మే 1 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి క్రీడా పాఠశాలల్లో ప్రవేశం ఉంటుందన్నారు. ఎంపికై న విద్యార్థుల్లో పల్లెర్ల శేయష్, కొండ హరిహరన్, రాకం వేధాంత్, గాలిపెల్లి శివతేజ, రామంచ కృతిక్, దోమల గౌతమ్ రామ్, ఆరె శ్రీ సహస్, రాచర్ల అనురాగ్, మహమ్మద్ అర్హముద్దీన్, మేంగని అనిరుధ్, విద్యార్థినుల్లో బొమ్మెన అధ్విక, బొగురాల మాన్వి, కావేర తీఖ్షిత, రొడ్డ శాన్విక, చింతం సింధూజ, మలవత్ సాయి పల్లవి, సింగతి అక్షయ, కొడపర్తి లితాక్ష, బానోత్ హిమజ, ధరావత్ అక్షయ ఉన్నారు.
సీఎం సభలో తప్పిపోయిన మహిళ
బజార్‌హత్నూర్: మండలంలోని పిప్రిలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగసభకు హాజరయైన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బోరిగామకు చెందిన బత్తుల గంగూబాయి తప్పిపోయినట్లు ఎస్సై సంజయ్ కుమార్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8712659934, 9440619432 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


