భీమారం/చెన్నూర్‌రూరల్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. భీమారం మండల కేంద్రం, చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, భీమారం మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకన్న, చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, బూత్ అద్యక్షుడు సింగారపు రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


