మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌కు చెందిన కారుకూరి సత్తయ్య(63) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి సత్తయ్య సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం స్థానిక ఓ లిక్కర్ మార్ట్‌లో మద్యం సేవించి అక్కడే కుప్పకూలిపోయాడు. సిబ్బంది డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ప్రైవేటు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సత్తయ్య మృతిచెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య సత్యలీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధుసూధన్‌రావు తెలిపారు.


