ఆహార భద్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత అందరి బాధ్యత

Apr 7 2026 7:25 AM | Updated on Apr 7 2026 7:25 AM

మంచిర్యాలటౌన్‌: సురక్షితమైన ఆహారం ఆరోగ్యానికి ఆధారమని, ఆహార భద్రత అందరి బాధ్యత అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫుడ్‌ సేఫ్టీపై ఆరోగ్య కార్యక్రమాల అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగాలు రాకుండా ఉంటుందని, తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్‌ సేఫ్టి అధికారి మహేష్‌ వసురం, నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సుజాత, ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీధర్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement