బోథ్‌ ఏరియా ఆస్పత్రి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బోథ్‌ ఏరియా ఆస్పత్రి పరిశీలన

Apr 7 2026 7:25 AM | Updated on Apr 7 2026 7:25 AM

బోథ్‌: బోథ్‌ ఏరియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫైనాన్స్‌ సెక్రెటరీ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సోమవారం పరిశీలించారు. పిప్రిలో సీఎం సభ అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజనాల రవీంద్ర ప్రసాద్‌ విన్నపం మేరకు ఆస్పత్రిని పరిశీలించారు. పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని, భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వైద్య పరికరాలు, ఫర్నిచర్‌, ఇతర మౌలిక వసతుల కోసం టెండర్‌ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. దీనిపై డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా అన్ని వసతులతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

మందుబాబుల వీరంగం

మందమర్రిరూరల్‌: పట్టణంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో సోమవారం ఇద్దరు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఎస్సై నరేష్‌ సంఘటన స్థలా నికి చేరుకుని నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రతీరోజు వైన్‌షాపుల వద్ద మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని, పోలీసులు పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement