కోటపల్లి/వేమనపల్లి: గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన కోటపల్లి మండలం మల్లంపేట, వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం పరిశీలించారు. ప్రజాపాలన 99రోజుల ప్రణాళిక పనులు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడారు. మల్లంపేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలతో మాట్లాడారు. నీల్వాయిలో కేజీబీవీకి వెళ్లి భోజన వసతి, అదనపు గదుల నిర్మాణ పనుల వివరాలు తెలుసుకున్నారు. వేమనపల్లికి తొలిసారిగా వచ్చిన అదనపు కలెక్టర్‌ను డీఎల్‌పీవో సతీష్, సర్పంచ్ సమ్మయ్య శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో డీఎల్‌పీఓ సతీష్, వేమనపల్లి ఎంపీడీఓ కుమారస్వామి, ఎంపీఓ వెంకటేష్, ఎస్‌ఓ మయూరి, పంచాయతీ రాజ్ ఏఈ ప్రదీప్, హౌసింగ్ ఏఈ కార్తీక్, సర్పంచ్‌లు చెన్నూరి సమ్మయ్య, సర్పంచ్‌లు అలూరి సంపత్, తాళ్ల వెంకటమ్మ పాల్గొన్నారు.


