యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెండు లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు, మూడు సబ్‌స్టేషన్లు, ఏటీసీ మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉంది. సీఎం అంటేనే రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. గుర్తించి మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి. బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలి. అలాగే రూ.345 కోట్లతో చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.40 కోట్లు ప్రకటించాలి. జందాపూర్–కరంజీ రోడ్డు పనులు పూర్తి చేయాలి. బోథ్‌లో డిగ్రీ కళాశాల, మినీస్టేడియం, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరు చేయాలి. సిరిచెల్మ, భరంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్


