ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని ఏ రోజూ ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే విమానాయశ్రయ పనులను ప్రారంభిస్తాం. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేయడంతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడం సంతోషంగా ఉంది. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి


