శ్రీరాంపూర్: ఏరియా క్రీడాకారులు కోలిండియా పోటీల్లో రాణించాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్‌ప్రసాద్ అన్నారు. ఆదివారం నస్పూర్ గోదావరికాలనీలోని ప్రా ణహిత స్టేడియంలో ఆర్కే 7 గని కార్మికుల వన్‌డే క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు తమ క్రీడానైపుణ్యానికి పదునుపెట్టుకొని పోటీల్లో రాణించాలన్నారు. క్రీడాకారులకు యూనియన్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కంపెనీ క్రీడా దు స్తులు, స్పోర్ట్స్ మెటీరియల్‌ను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూని యన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు, కేంద్ర కమిటీ నాయకులు భీంరావు, కలవేని శ్యాం, గరిగే స్వామి, తిరుపతి, రాజు, ప్రవీణ్, జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
విన్నర్‌గా ఇంజనీరింగ్ డిపార్టుమెంట్
ఫైనల్ మ్యాచ్‌లో ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ టీం విన్నర్‌గా, రన్నర్‌గా సీ రిలే టీం నిలిచాయి. విజేతలకు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధూకర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు.


